: విశాఖకు రెండు రోజుల్లో విద్యుత్ పునరుద్ధరణ: విద్యుత్ శాఖ కార్యదర్శి
మరో 48 గంటల్లో విశాఖలో విద్యుత్ పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణకు నాలుగైదు రోజులు పడుతుందన్నారు. విశాఖలో నాలుగు చోట్ల పంపుహౌస్ లకు విద్యుత్ అందించామని విలేకరుల సమావేశంలో జైన్ వెల్లడించారు. తుపాను వల్ల ఉత్తరాంధ్రలో విద్యుత్ శాఖకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. మూడు జిల్లాల్లో 15 వేల ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని చెప్పారు. విశాఖలో భూగర్భ విద్యుత్ కోసం సెంట్రల్ బ్యాంకును రూ.500 కోట్లు అడిగామని ఆయన పేర్కొన్నారు. అనంతరం పవర్ గ్రిడ్ ఛైర్మన్ నాయక్ మాట్లాడుతూ, రెండు రోజుల్లో పారిశ్రామిక ప్రాంతాలకు విద్యుత్ అందిస్తామన్నారు. నిన్ననే విశాఖ రైల్వే స్టేషన్ కు విద్యుత్ పునరుద్ధరించామన్న ఆయన, నీరు నిల్వ ఉండటంవల్ల విద్యుత్ స్థంభాలను నిలబెట్టడం కష్టతరంగా ఉందని తెలిపారు.