: హుదూద్ నష్టం రూ.70 వేల కోట్ల మేర ఉండొచ్చు: చంద్రబాబు


కోస్తాంధ్రలో విధ్వంసం సృష్టించిన హుదూద్ కారణంగా రూ. 70 వేల కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నాలుగు రోజులుగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే మకాం వేసిన ఆయన బుధవారం విశాఖ కలెక్టరేట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. హుదూద్ వల్ల జరిగిన నష్టంపై ఇప్పటికిప్పుడే ఓ అంచనాకు రాలేనప్పటికీ, రూ.60-70 వేల కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం నష్టం అంచనాలను పక్కనబెట్టిన తాము సహాయక చర్యల్లో నిమగ్నమయ్యామన్నారు. త్వరలో రానున్న కేంద్ర బృందాలు సమగ్ర నష్టాన్ని అంచనా వేస్తాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News