: కేన్సర్ బాధిత మహిళ కేబీసీలో నెగ్గింది!


సోనీ టీవీలో ప్రసారమవుతున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రతి ఒక్కరినీ టీవీలకు కట్టిపడేస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ యాంకరింగ్ తో ఈ షో మరింత ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఏడు ఎడిషన్లను పూర్తి చేసుకున్న ఈ షో, ఎనిమిదో ఎడిషన్ కు తెరలేపింది. ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపుతున్న ఈ షోలో తొలి మహిళా కరోడ్ పతి అవతరించారు. వసాయి కి చెందిన మేఘా పాటిల్ ఎనిమిదో ఎడిషన్ లో తొలి మహిళా కరోడ్ పతిగా ఖ్యాతి సంపాదించారు. గృహిణిగానే కాక ట్యూషన్ టీచర్ గా పనిచేస్తున్న పాటిల్, కేన్సర్ బాధితురాలట. పిల్లల సహకారంతో కేబీసీ స్టేజీ ఎక్కిన పాటిల్, గెలుచుకున్న నగదును కూడా పిల్లలకే ఇచ్చేస్తానని ప్రకటించారు. ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News