: పురుషుడికో న్యాయం, స్త్రీకో న్యాయమా?... చైనాలోనూ ఇంతేనా!
"ఒకే పనిని స్త్రీపురుషులిద్దరూ కలసి చేసినప్పుడు అందులో చెరిపేవారొకరు, చెడిపోయేది మరొకరు ఎలా అవుతారు? ఈ విషయంలో స్త్రీని మాత్రమే సమాజం ఎందుకు తప్పుబడుతుంది? పెళ్ళి కాకుండానో, ఒకరినొకరు ఇష్టపడో స్త్రీపురుషులిద్దరూ శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీనే ఎందుకు చెడిపోతుంది?" మహా రచయిత చలం దశాబ్దాల క్రితం వెలిబుచ్చిన తీవ్ర ఆవేదన ఇది. ఆయన పుట్టిన మన భారత గడ్డపై నేటికీ ఆ భావనలు మారలేదు. ఇప్పటికీ అలాంటి ఘటనల్లో స్త్రీయే బాధితురాలిగా మిగులుతోంది. అభ్యుదయ పథాన దూసుకుపోతోందని మిగతా ప్రపంచం భావిస్తున్న చైనాలోనూ ఇంతే. లిన్ యావో లీ అనే మరో మహిళతో భర్త సంబంధం పెట్టుకున్నాడని హుయాంగ్ నగరంలో ఓ భార్య ఏం చేసిందో చూడండి. మరో ముగ్గురు మహిళలతో కలిసి లిన్ బట్టలూడదీసి దారుణంగా కొట్టింది. పట్టపగలే జరిగింది ఇదంతా! భర్తను మాత్రం అదే రీతిలో దండించలేకపోయిందా భార్య. లిన్ ను దారుణంగా కొడుతుంటే అందరూ చూశారే గానీ, 'ఈ 'సంబంధం'లో మగాడి తప్పు కూడా ఉంది కదా!' అని ఒక్కరు కూడా ప్రశ్నించలేదట! చివరకు పోలీసులు సైతం ఇదేమని అడక్కుండా, తీవ్రంగా గాయపడిన లిన్ ను ఆసుపత్రిలో చేర్చారు.