: 'లవ్ జిహాద్' అంటే తెలియదు: సైఫ్ అలీఖాన్


ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపిన 'లవ్ జిహాద్'పై చాలా రాజకీయ పార్టీలు బహిరంగంగా మాట్లాడాయి. కొంతమంది అయితే ఉప ఎన్నికల్లో ప్రచార సాధనంగా కూడా ఉపయోగించుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ అంశంపై ఓ ఆంగ్ల దినపత్రికకు ప్రత్యేకంగా రాసిన కాలమ్ లో అభిప్రాయాలను రాశాడు. ముఖ్యంగా కులాంతర వివాహాలు, మతం, లవ్ జిహాద్ పై తనకున్న అపనమ్మకంపై సైఫ్ ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. అంతేగాక తన కుటుంబంలో కులాంతర వివాహాలు కొత్తేమీ కాదన్న ఈ చోటా నవాబ్... తన తల్లిదండ్రులైన షర్మిలా ఠాగూర్, మున్సూర్ అలీఖాన్ పటౌడీ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా పలువురి నుంచి విమర్శలు ఎదుర్కొన్నారని చెప్పాడు. ఇదే సమయంలో కరీనాకపూర్ తో తన వివాహంపై ప్రస్తావించిన సైఫ్, ఆ పెళ్లి సమయంలో ఎదుర్కొన్న సమస్యలను కూడా పేర్కొన్నాడు. మొదట్లో ఇంటర్నెట్ లో తమ ఫోటోలు పెట్టి కొంతమంది బెదిరింపులు చేసేవారని, తర్వాత ధైర్యంగా ఉన్నామని, ఇప్పుడు చాలా సంతోషమైన దంపతులుగా ఉన్నట్లు చెప్పాడు. అసలు 'లవ్ జిహాద్' భావం ఏంటో తనకు అర్థం కాలేదన్నాడు. అయితే కులాంతర వివాహాలంటే లవ్ జిహాద్ కాదన్నాడు. తాను కూడా ఓ విజయవంతమైన పెళ్లి నుంచి వచ్చిన వ్యక్తినేనని సైఫ్ వివరించాడు.

  • Loading...

More Telugu News