: తుపాను వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కు అపార నష్టం: మంత్రి గంటా


హుదూద్ తుపాను వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కు అపార నష్టం వాటిల్లినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్లాంట్ కు రోజుకు రూ.40 కోట్ల ఉత్పత్తి నష్టం జరిగిందన్నారు. అంతకుముందు గంటా, ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాసరావు తదితరులు స్టీల్ ప్లాంట్ ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సాయంత్రంలోగా స్టీల్ ప్లాంట్ కు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం వేలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News