: కీచకుడికి విమానమైనా, మరెక్కడైనా ఒక్కటే!


నిర్జన ప్రదేశాల్లోనో, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాల్లోనో, లేక, ఆఫీసు విధులు ముగించుకుని వెళుతుండగానో... అబలలు లైంగిక అకృత్యాలకు గురైన ఉదంతాలు ఎన్నో విన్నాం. ఇది కూడా అలాంటిదే. అయితే, విమానంలో జరిగిందీ ఘటన. జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం హోనోలులు నుంచి కాన్సాయ్ సిటీ వస్తుండగా, మైకేల్ తనోయ్ (29) అనే ప్రయాణికుడు టాయిలెట్లోకి చొరబడి ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ఎమర్జెన్సీ బటన్ నొక్కడంతో విమాన సిబ్బంది టాయిలెట్ తరుపు తెరిచేందుకు యత్నించారు. అయితే, తనోయ్ తలుపు లోపలి గడి వేయడంతో తెరుచుకోలేదు. దీంతో, సిబ్బంది స్క్రూలు విప్పదీసి తలుపు తెరిచి, ఆ మహిళను రక్షించారు. వెంటనే విమానాన్ని తిరిగి హోనోలులుకు తీసుకెళ్ళారు. అక్కడ ఎఫ్ బీఐ అధికారులు తనోయ్ ను అరెస్ట్ చేశారు. కాగా, సదరు మహిళ తన తల్లితో కలిసి హవాయ్ దీవుల్లో విహారయాత్ర ముగించుకుని జపాన్ కు వెళుతోంది. అటు, తనోయ్ తల్లి కూడా అతనితోనే విమానంలో ప్రయాణిస్తోంది. ఘటన అనంతరం ఆమె తన కుమారుడు 'డిప్రెషన్'తో బాధపడుతున్నాడని, చికిత్స పొందుతున్నాడని విమాన సిబ్బందితో చెప్పింది. టాయిలెట్లోంచి వెలుపలికి వచ్చిన తర్వాత అతగాడు తల్లి ఇచ్చిన ఔషధం తాగి వెంటనే నిద్రలోకి జారుకున్నాడట. ఈ మేరకు ఎఫ్ బీఐ అధికారులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. తనోయ్ పై నేరారోపణలు రుజువైతే సుదీర్ఘకాలం శిక్ష పడే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News