: తుపాను నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నాం: ఏపీ సీఎం
హుదూద్ తుపాను నష్టం ఎంత అన్నది అంచనా వేయలేకపోతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖ పరిశ్రమలకు అపారనష్టం కలిగిందన్నారు. విశాఖ ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని, ఇక గ్రామీణ ప్రాంతాల్లో సహాయక చర్యలపై దృష్టి పెడతామని తెలిపారు. మరో రెండు రోజుల్లో కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తుందని, తుపాను నష్టంపై పరిశీలన చేస్తుందన్నారు. అటు విశాఖలో ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, అరకేజీ ఉప్పు, అరకేజీ కారం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్ ఉచితంగా ఇవ్వనున్నట్లు వివరించారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి హెలికాప్టర్లలో తెప్పించిన ఆరు లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేశామన్నారు.