: 'ఫోబోస్' ను గుర్తించిన 'మామ్'


అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) పనితీరు శాస్త్రవేత్తలకు సంతృప్తి కలిగిస్తోంది. అంగారక వాతావరణంలోకి అడుగిడిన మరుసటి రోజే తొలి ఇమేజ్ ను భూమికి పంపి ఇస్రో వర్గాలను ఆనందంలో ముంచెత్తింది మామ్. తాజాగా, అంగారకుడి చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహం ఫోబోస్ ను గుర్తించి, దాని ఛాయాచిత్రాన్ని పంపింది. అరుణ గ్రహానికి రెండు సహజ ఉపగ్రహాలు ఉండగా, వాటిలో ఫోబోస్ అతి పెద్దది. ఫోబోస్ పశ్చిమ దిశ నుంచి తూర్పు వైపునకు తన కక్ష్యలో పరిభ్రమిస్తుండగా, మామ్ తన కెమెరాలో బంధించింది. అంగారకుడి చుట్టూ పరిభ్రమించే మరో ఉపగ్రహం పేరు డీమోస్. 1877లో ఈ రెండింటిని కనుగొన్నారు. కాగా, ఫోబోస్ విషయమై యూఎస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇది ప్రతి వందేళ్ళకు 1.8 మీటర్ల చొప్పున అంగారకుడిని సమీపిస్తోందని, మరో 50 మిలియన్ల సంవత్సరాలకు ఇది అంగారకుడిని ఢీకొడుతుందని అంచనా వేసింది.

  • Loading...

More Telugu News