: వర్మ వ్యవహారంలో ఎంత దూరమైనా వెళతా: బోనీ కపూర్


రాంగోపాల్ వర్మ తన తాజా చిత్రం 'శ్రీదేవి'తో మరోసారి వివాదాల తేనెతుట్టెను కదిలించారు. ఆ సినిమా పేరు తనకు అభ్యంతరకరం అని నటి శ్రీదేవి ఇప్పటికే వర్మకు లీగల్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ మాట్లాడుతూ, కుటుంబ శ్రేయస్సు కోసం ఎంతదూరమైనా వెళతానని స్పష్టం చేశారు. "సినిమా చేసే హక్కు రాముకు ఉంది. అయితే, అతడు తనను తానే వివాదాస్పదం చేసుకుంటున్నాడు. ఓ వైపు శ్రీదేవికి వీరాభిమానినని చెప్పుకుంటూ, మరోవైపు, అనైతికతను ప్రమోట్ చేయడానికి ఆమె పేరును వాడుకుంటున్నాడు. ఈ వ్యవహారంలో ఎంతదూరమైనా వెళతాను" అని బోనీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News