: ఓటు వేసిన అనంతరం సెల్ఫీ తీసుకున్న సుప్రియా సూలే
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబయిలోని తాడ్ దేవ్ గుజరాతీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుమార్తె, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే పూణె జిల్లాలోని బారామతిలో ఓటు వేశారు. అనంతరం తన సహచరులతో కలసి సెల్ఫీ తీసుకున్నారు.