: నేడు విశాఖలో జగన్ పర్యటన
వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు వరుసగా రెండో రోజు పర్యటించనున్నారు. బుధవారం నాటి పర్యటనలో భాగంగా ఆయన విశాఖపట్నంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. నగరంలోని షిప్పింగ్ హార్బర్, జాలారిపేట, ఆంధ్రా వర్సిటీ, పెద్ద గదిలి, ధర్మవరం తాడిచెట్లపాలెం, దుర్గ గుడి, కొబ్బరితోట ప్రాంతాల్లో పర్యటించనున్నారు.