: ఎబోలా నివారణ కోసం ఫేస్ బుక్ అధినేత 25 మిలియన్ డాలర్ల వితరణ
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ఎబోలా మహమ్మారి నివారణ కోసం ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ లు 25 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అమెరికాలోని సీడీసీ ఫౌండేషన్ కు ఈ మొత్తాన్ని వారు అందజేశారు. ఎబోలా నివారణ, చికిత్సల కోసం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ 9 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో జుకెర్ బర్గ్ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.