: గిరిజనుడిని కాల్చి చంపిన మావోయిస్టులు
కొరియర్ అనే నెపంతో మిడియం బాలకృష్ణ అనే గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రాపురం అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. గత ఆదివారం మావోయిస్టులు బాలకృష్ణను గ్రామం నుంచి అపహరించుకుపోయారు. మావోల చర్యతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పెషల్ పోలీసులు, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి.