: నేడు హైదరాబాద్ విచ్చేస్తున్న ఆర్ బీఐ గవర్నర్


ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నేడు హైదరాబాద్ విచ్చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ పాలక మండలి సమావేశంలో పాల్గొనడానికి ఆయన వస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి... వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. షెడ్యూల్ ప్రకారం తొలిరోజు (ఈరోజు) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. కానీ, చంద్రబాబు తుపాను సహాయక చర్యల్లో భాగంగా వైజాగ్ లోనే ఉండిపోవడంతో... వీరి భేటీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు హైదరాబాద్ వస్తే, వీరిరువురూ సమావేశమవుతారు. లేని పక్షంలో, ఏపీ ఆర్థిక మంత్రి యనమల ఆర్ బీఐ గవర్నర్ తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News