: పాక్ క్రికెట్ కెప్టెన్ బ్యాంకు ఖాతా నిలిపేశారు


పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మిస్బా-వుల్-హక్, అజర్ అలీపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూ (ఎఫ్ బీఆర్) అధికారులు కొరడా ఝుళిపించారు. పన్నులు చెల్లించనందుకు వారి బ్యాంకు ఖాతాలను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. మిస్బా 30.9 లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉండగా, అజర్ అలీ కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. దీంతో వీరిద్దరి నుంచి పన్నులు వసూలు చేసేందుకే ఖాతాలు నిలిపేసినట్టు ఎఫ్ బీఆర్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, ఎఫ్ బీఆర్ అధికారుల చర్యను మిస్బా సవాల్ చేయనున్నట్టు అతని సన్నిహితులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News