: పుట్టినరోజున యువతిని భవనంపై నుంచి తోసేసిన ప్రియుడు


ఓ యువతి పుట్టిన రోజునే దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్, చిలకలగూడ పరిధిలో రూప అనే యువతిపై సాదిక్ అనే యువకుడు దాడి చేసి మూడవ అంతస్థు నుంచి కిందికి తోసేశాడు. దీనిని చూసిన స్థానికులు రూపను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె సికింద్రాబాద్ అపోలోలో చికిత్స పొందుతోంది. ఆమెను మేడపై నుంచి కిందికి తోసేసిన సాదిక్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తామిద్దరం ప్రేమికులమంటూ చెప్పిన సాదిక్, రూపను ఎందుకు తోసేసింది మాత్రం చెప్పలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News