: మోడీపై విరుచుకుపడిన శివసేన
ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన విరుచుకుపడింది. శివసేన అధికారిక పత్రిక సామ్నా ఎడిటోరియల్ లో మోడీ, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ కు తగిన శాస్తి చేయాలని బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెడితే, ఆ పార్టీ మహారాష్ట్రలో శివసేనను పెకలించాలని చూసిందని దుయ్యబట్టింది. ముంబైలో నివసిస్తున్న గుజరాతీలను మోడీ తప్పుదోవ పట్టించారని సామ్నా విమర్శించింది. మోడీకి సొంతగా గెలిచే శక్తి లేదని ఎడిటోరియల్ తెలిపింది. మోడీ ప్రధాని పదవి చేపట్టిన తరువాత మహారాష్ట్ర పార్టీ (శివసేన)ని గుర్తించడం మానేశారని ఎడిటోరియల్ లో పేర్కొన్నారు. అధికారదాహంతో ఉన్న బీజేపీ శివసేనను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది.