: పీఎస్ఎల్వీ ప్రయోగానికి ముందు శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్


ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి భక్తుడైన రాధాకృష్ణన్ మంగళయాన్ ప్రయోగానికి ముందు స్వామి వారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇస్రో చేసే ప్రతి ప్రయోగానికి ముందు ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. పీఎస్ఎల్ వీ-సీ 6 వాహక నౌకను ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయన స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు జేఈవో శ్రీనివాసరాజు, పండితులు వేదాశీర్వచనం పలికి స్వాగతించారు. పీఎస్ఎల్వీ- సీ 5 ప్రయోగానికి సోమవారం కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News