: ధృవీకరణ పత్రాల దరఖాస్తుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం వివిధ ధృవీకరణ పత్రాల దరఖాస్తుల గడువు పెంచింది. ఆహార భద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. కుల, ఆదాయ, నివాస పత్రాలకు దరఖాస్తుల గడువు కూడా ఈ నెల 20 వరకు పొడిగించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.