: విశాఖలో 19 వరకు పాఠశాలలకు సెలవులు
హుదూద్ తుపాను ధాటికి విశాఖ జిల్లా పాఠశాలలు సమస్యల్లో కూరుకుపోయాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 19వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు డీఈవో తెలిపారు. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు.