: 70 లక్షల యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు హ్యాక్ అయ్యాయా?
ఆన్ లైన్ లో డాక్యుమెంట్లు దాచుకునే వెబ్ సైట్ 'డ్రాప్ బాక్స్' హ్యాకర్ల బారిన పడింది. డ్రాప్ బాక్స్ వెబ్ సైట్ లోని 70 లక్షల మంది ఖాతాదారుల యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు హ్యాకింగ్ కు గురయ్యాయని పేస్ట్ బిన్ అనే వెబ్ సైట్ తెలిపింది. గుర్తు తెలియని హ్యాకర్ వీటిని హ్యాక్ చేశాడని ఆ వెబ్ సైట్ వెల్లడించింది. కాగా, ఈ వార్తలను డ్రాప్ బాక్స్ ఖండించింది. ఇతర వెబ్ సైట్ల నుంచి తస్కరించిన పాస్ వర్డ్ లతో హ్యాక్ చేసేందుకు హ్యాకర్ ప్రయత్నించి విఫలమైనట్టు డ్రాప్ బాక్స్ తెలిపింది. యూజర్ల సమాచారం భద్రంగానే ఉందని ఆ డ్రాప్ బాక్స్ వివరించింది. ప్రైవసీ కోరుకునే నెటిజన్లు సోషల్ మీడియా, ఇతర వెబ్ సైట్లలో తమ సమాచారం దాచుకోవద్దని ప్రముఖ విజిల్ బ్లోయర్ స్నోడెన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.