: రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రధాని గుర్తించారు: పరకాల


విశాఖలో ప్రధాని మోడీ పర్యటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా నష్టం తగ్గించగలిగారని మోడీ అన్నట్టు పరకాల చెప్పారు. స్మార్ట్ సిటీ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రధాని సూచించారని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణపై అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కాగా, విశాఖలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పరకాల మీడియాకు తెలిపారు. రేపు సాయంత్రం కల్లా నీటి సరఫరా పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News