: ట్వీట్ల ద్వారా అతడి సంపాదన రూ.3 కోట్లు


కేవలం ట్వీట్ల ద్వారా ఓ 23 ఏళ్ల యువకుడు ఏడాదికి రూ.3 కోట్లు సంపాదిస్తున్నాడు. పలు కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువుల పనితీరుపై వాస్తవాలు వెల్లడిస్తూ ట్వీట్లు చేయడం వల్ల అతను మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. న్యూయార్క్ లోని బ్రూక్లిన్ కు చెందిన క్రిస్ సాంచెజ్ అనే వ్యక్తి 'యుబర్ ఫాక్ట్స్' ట్విట్టర్ ఖాతాకు లక్షల్లో ఉన్న ఫాలోవర్లు క్లిక్ చేసే ప్రతిసారి ఆయనకు కొంత మొత్తం సమకూరుతుంది. ఒక క్లిక్ కు 0.1 నుంచి 0.3 డాలర్లను క్రిస్ సంపాదిస్తున్నాడు. ఫోర్డ్, పారామౌంట్ తదితర ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని వాటికి చెందిన ఉత్పత్తులకు సంబంధించిన సమాచారంతో పాటు, వెబ్ సైట్లలో లింకులను ట్వీట్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంటాడు. సాంచెజ్ యుబర్ ఫాక్ట్స్ అనే యాప్ తయారు చేసి దాని ద్వారా పలు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం అందిస్తాడు. ఈ యాప్ ను ఇప్పటివరకు 1.5 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ క్లిక్ ల ద్వారా అతనికి ఏడాదికి రూ.3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిపడుతోంది.

  • Loading...

More Telugu News