: నాగావళిలో ఏపీ మంత్రులకు తప్పిన ముప్పు


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యల పర్యవేక్షణకు వెళ్ళిన ఏపీ మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడుకు ముప్పు తప్పింది. ప్రజలను పరామర్శించి వస్తుండగా... నాగావళి నదిలో వారు ప్రయాణిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బోటు శ్రీకాకుళం జిల్లా నారాయణపురం వద్ద ఒక్కసారిగా నిలిచిపోయింది. ఇంజిన్ స్టార్ట్ కాకపోవడంతో బోటులో ఉన్నవారితో పాటు, మంత్రుల అనుచరుల్లోనూ టెన్షన్ మొదలైంది. బోటు నిలిచిపోయిన ప్రాంతంలో సెల్ సిగ్నల్స్ కూడా అందకపోవడంతో ఆందోళన అధికమైంది. బోటు ఆగిపోయిన విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వెంటనే రెండు బోట్లను పంపడంతో, మంత్రులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News