: విశాఖకు రైలు సర్వీసుల పునరుద్ధరణ
తుపాను కారణంగా నిలిచిపోయిన రైలు సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. ఈరోజు సికింద్రాబాద్- విశాఖ గోదావరి ఎక్స్ ప్రెస్, విశాఖ, గరీబ్ రథ్ రైళ్లు మినహా మిగతా రైలు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ఉదయం విశాఖ జిల్లా ఎలమంచిలి వద్ద దెబ్బతిన్న రైల్వేట్రాక్ మరమ్మతు పనులు నిర్వహించారు. దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ఈ పనులను పర్యవేక్షించారు.