: రూ.1000 కోట్ల తాత్కాలిక సాయం ప్రకటించిన మోడీ


హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలనకు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ వాసులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏపీకి రూ.1000 కోట్ల తాత్కాలిక సాయం ప్రకటించారు. విశాఖలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేవరకు ఏపీకి సహకారం అందిస్తామని చెప్పారు. విశాఖను స్మార్ట్ సిటీ చేస్తానని అమెరికాలోనూ చెప్పానని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తుపాను సహాయక చర్యల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని మోడీ ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేశాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం వల్ల తుపాను నష్టం చాలా తగ్గిందని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో విశాఖ వాసులు ప్రదర్శించిన నిబ్బరం ప్రశంసనీయమని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి ఎంతో సహకరించారని పేర్కొన్నారు. నష్టం తీవ్రత తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ఫలితాన్నిచ్చాయని అన్నారు. నష్ట నివారణకు కోస్ట్ గార్డ్, ఆర్మీ, నేవీ శ్రమించాయని తెలిపారు. మోడీ వెంట సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులున్నారు.

  • Loading...

More Telugu News