: తుపాను బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
హుదూద్ తుపాన్ బాధితులకు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో సీఎం చంద్రబాబుకు అందజేస్తానని తెలిపారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే పర్యటిస్తానని చెప్పారు. ఇదే సమయంలో తుపాను సహాయక చర్యల్లో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చారు.