: టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు మరోమారు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ తలపెట్టిన ప్లీనరీ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మొదట ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాలనుకున్నారు. హుదూద్ తుఫాను కారణంగా వాయిదా వేశారు. దాంతో, ఈ నెల 18,19 జరపాలని అనుకున్నారు. అయినా మళ్లీ పలు కారణాలతో సమావేశాలు వాయిదాపడ్డాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, సమావేశాలకు ఏర్పాట్లు ఇంకా పూర్తికానందునే వాయిదాపడినట్లు చెబుతున్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది చెప్పలేదు.