: మంత్రి ఈటెల సభలో అనుకోని అతిథులు!


తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ నేడు కరీంనగర్ జిల్లాలోని కేసీ క్యాంప్ వద్ద ఓ విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. సాధారణంగా శంకుస్థాపన కార్యక్రమాల తర్వాత సభ నిర్వహించడం తెలిసిందే. అదే రీతిలో ఇక్కడా ఓ సభ పెట్టారు. సభ జరుగుతుండగా తేనెటీగలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. దొరికినవారిని దొరికినట్టు కుట్టాయి. దీంతో, కొందరు మహిళలు గాయపడ్డారు. అయితే, వెంటనే స్పందించిన భద్రత సిబ్బంది, మంత్రి ఈటెలతో పాటు జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్యను కూడా ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తరలించారు.

  • Loading...

More Telugu News