: నా ఎమ్మెల్యే నిధులతో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో మరుగుదొడ్లు కట్టిస్తా: కేజ్రీవాల్


స్వచ్ఛ్ భారత్ పేరిట దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యానికి తెర తీసిన బీజేపీ ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ షాకిచ్చారు. బీజేపీ ఢిల్లీ శాఖ కార్యాలయంలో మహిళలకు మరుగుదొడ్లు అందుబాటులో లేవని, తన ఎమ్మెల్యే నిధులతో ఆ కొరతను తీరుస్తానని ప్రస్తావిస్తూ ఢిల్లీ మునిసిపల్ కమిషనర్ కు ఆయన లేఖ రాశారు. పండిట్ పంత్ మార్గ్ లోని బీజేపీ ఢిల్లీ శాఖ కార్యాలయం అరవింద్ కేజ్రీవాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ పరిధిలోకే వస్తుంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్, ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ కు లేఖ రాశారు. ‘‘ఆ భవనం బీజేపీకి సంబంధించినదే అయినా, నా నియోజకవర్గ పరిధిలో ఉంది. రాజకీయాలకు అతీతంగా నా ఎమ్మెల్యే స్థానిక నిధుల నుంచి ఆ కార్యాలయంలో మరుగుదొడ్లను నిర్మిస్తాను’’ అంటూ ఆయన మంగళవారం ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News