: టైమ్స్ 'ప్రభావశీల యువత'గా ఒబామా కుమార్తెలు, మలాలా
టైమ్స్ పత్రిక తాజా 'ప్రభావశీల యువత' జాబితాను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు మాలియా (16), సాష (13), నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాల యూసఫ్ జాయ్ (17), న్యూజిలాండ్ గాయని లార్డే (17) ఈ జాబితాలో ప్రథమంగా నిలిచారు. సోషల్ మీడియా ఫాలోయింగ్, వ్యాపార విజయాలు, సాంస్కృతిక ప్రాముఖ్యత, ప్రశంసలు ఆధారంగా 25 నుంచి 29 మంది యువతతో టైమ్స్ ఈ జాబితాను తయారుచేసింది. వారిలో పైన పేర్కొన్న నలుగురు మిగతావారి కంటే మిన్నగా ఉన్నారని టైమ్స్ తెలిపింది.