: మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరాలనుకున్నారు: కడియం శ్రీహరి


టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుపై టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. వరంగల్ లో కడియం మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నేతలను అడ్డు పెట్టుకుని ఎర్రబెల్లి కూడా టీఆర్ఎస్ లో చేరాలనుకున్నారని ఆరోపించారు. మంత్రి పదవి కోసం ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. అలాంటి ఎర్రబెల్లి... టీఆర్ఎస్ ను, టీఆర్ఎస్ నేతలను విమర్శించడం ఆయన సంస్కారాన్ని ఎత్తి చూపుతోందని అన్నారు. తాను టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నించలేదని ఎర్రబెల్లి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News