: క్రికెట్లో చకర్ల ఏరివేత చివరి దశకు వచ్చింది: ఐసీీసీ


గతేడాది విండీస్ స్పిన్నర్ షేన్ షిల్లింగ్ ఫోర్డ్ తో మొదలైన చకర్ల ఏరివేత పర్వం చివరి దశకు వచ్చిందని ఐసీీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జెఫ్ అలార్డైస్ అన్నారు. షిల్లింగ్ ఫోర్డ్, పాక్ స్పిన్నర్లు సయీద్ అజ్మల్, మహ్మద్ హఫీజ్, విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తదితరులు చకింగ్ (త్రో బౌలింగ్) కు పాల్పడుతున్నారంటూ బౌలింగ్ యాక్షన్ ను ఇప్పటికే ఐసీసీ పరిశీలనలో ఉంచింది. వీరికి బయోమెకానికల్ పరీక్షలు నిర్వహించి, బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధమని తేలితే వారిని అన్ని ఫార్మాట్ల నుంచి నిషేధిస్తుంది. ఈ అంశంపై అలార్డైస్ మాట్లాడుతూ, ఇంకా ఎందరో బౌలర్లు అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి బౌలర్లను ఆటకు దూరం పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు అంపైర్లు ఫిర్యాదు చేసిన బౌలర్లు, పరీక్షల్లో నిలబడలేకపోయారని పేర్కొన్నారు. ఆ పరీక్షల ఫలితాలు అంపైర్ల నిర్ణయాలను సమర్థించాయని అలార్డైస్ చెప్పారు. రానున్న కాలంలో స్వచ్ఛమైన క్రికెట్ ను అందించడమే ఐసీసీ లక్ష్యమని తెలిపారు.

  • Loading...

More Telugu News