: విశాఖ విమానాశ్రయానికి రూ.500 కోట్ల నష్టం: ఏపీ సీఎం


హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సంతో విశాఖలో పలు సంస్థలు కోల్పోయిన నష్టాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఒక్క నేవీకే రూ.2వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.340 కోట్ల ఆస్తినష్టం, విశాఖ విమానాశ్రయానికి రూ.500 కోట్ల నష్టం జరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. అటు తుపాను వల్ల షిప్పింగ్ హార్బర్ కు వంద కోట్ల నష్టం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఇక 40 వేల కరెంటు స్తంభాలకు కూడా నష్టం జరిగిందన్నారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి విశాఖ పర్యటన గురించి తెలిపిన చంద్రబాబు... మధ్యాహ్నం 1.15కు ప్రధాని వస్తారన్నారు. విమానాశ్రయం నుంచి వచ్చి కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్టులో సమీక్ష నిర్వహిస్తారన్నారు.

  • Loading...

More Telugu News