: అనంతపురంలో అగ్నిప్రమాదం... రూ. 40 లక్షల విలువైన మందులు దగ్ధం


ఈ తెల్లవారుజామున అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక సప్తగిరి కూడలి సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉన్న అరవింద్ మెడికల్ ఏజన్సీలో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన నిప్పురవ్వలతో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ. 40 లక్షల విలువైన మందులు, వైద్య పరికరాలు అగ్నికి ఆహుతైనట్టు బాధితులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News