: తప్పు చేసిన వారే తొలుత దిద్దుబాట పట్టాలి: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్


అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వెంట ఉద్రిక్తతలకు కారణమైన పాకిస్థానే తొలుత దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. ఈ విషయంలో తొలి అడుగేసేందుకు భారత్ ససేమిరా అంటోంది. ఉద్రిక్తతలకు కారణం తాను కాదని, ముందుగా కాల్పులకు దిగిన పాక్ సైన్యమే ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని కూడ భారత విదేశాంగ శాఖ వర్గాలు వాదిస్తున్నాయి. పాక్ తో నిలిచిపోయిన ద్వైపాక్షిక చర్చలు సమీప భవిష్యత్తులో పునరుద్ధరణకు నోచుకునే అవకాశాలు లేని నేపథ్యంలో కాస్త కఠినంగా వ్యవహరించాలని మోడీ సర్కారు భావిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. తద్వారా పాక్ కు తగిన రీతిలో గుణపాఠం చెప్పే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నాయి. తన భూభాగంలోకి తీవ్రవాదులను పంపేందుకే పాక్, నిత్యం కాల్పుల పేరిట సైన్యం దృష్టి మరల్చే యత్నాలు చేస్తోందని కూడా భారత్ వాదిస్తోంది. కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా తన సైన్యాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా భారత్ అనుమానిస్తోంది.

  • Loading...

More Telugu News