: మీ సమస్యలో మేం తలదూర్చలేం: పాక్ కు ఐరాస సూచన


కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలన్న పాకిస్థాన్ విజ్ఞప్తిికి ఐక్యరాజ్య సమితి విముఖత వ్యక్తం చేసింది. దీంతో ఈ ఏడాది ఈ విషయంలో పాక్ కు రెండోసారి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. సుదీర్ఘ కాలంగా పరిష్కారానికి నోచుకోని కాశ్మీర్ వివాదంపై జోక్యం చేసుకోవడంతో పాటు భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగయ్యేలా చర్యలు చేపట్టాలని పాక్ ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్, ఇటీవల ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై ఐరాస సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి పర్హాన్ హక్ సోమవారం స్పందించారు. కాశ్మీర్ విషయంలో భారత్, పాక్ లు పరస్పరం చర్చలు నిర్వహించుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. తద్వారా ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం కూడా నెలకొంటుందని, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News