: రూ.1 తగ్గనున్న లీటర్ పెట్రోల్... డీజిల్ ధర రూ.3 తగ్గే సూచన


అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గుతున్న క్రమంలో దేశీయ చమురు సంస్థలు డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీపావళి కానుకగా లీటర్ పెట్రోల్ పై రూ.1 తగ్గించనున్న చమురు సంస్థలు, లీటర్ డీజిల్ పై ఏకంగా రూ.3 మేర తగ్గించనున్నట్లు తెలుస్తోంది. తాజా తగ్గింపు అమలైతే పెట్రోల్ ధరలు 16 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. పెట్రోల్ ధర తగ్గింపుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న చమురు సంస్థలు, ఈ వారంలో తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. అయితే డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి కేంద్ర కేబినెట్ అనుమతి అవసరమైన నేపథ్యంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. డీజిల్ ధర తగ్గింపు కూడా ఖాయమని చమురు సంస్థల వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  • Loading...

More Telugu News