: ఐరాస తీర్మానంతోనే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం: పాక్


కాశ్మీర్ అంశాన్ని పొరుగు దేశం పాకిస్థాన్ మరోమారు అంతర్జాతీయం చేసేందుకు యత్నించింది. మొన్నటి ఐరాస వేదికగా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, తాజాగా అమెరికా సెనేటర్లు తనను కలిసిన సందర్భంగా మరోమారు కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఐరాస తీర్మానాల ద్వారానే సుదీర్ఘ కాలంగా వివాదంగా ఉంటున్న కాశ్మీర్ అంశానికి పరిష్కారం దొరుకుతుందని ఆయన చెప్పారు. అంతేకాక సదరు చర్యలను ఐరాసనే తనకు తానుగా మొదలుపెట్టాలని కూడా షరీఫ్ అభిప్రాయపడ్డారు. భారత్-పాక్ మధ్య రద్దైన విదేశాంగ శాఖ కార్యదర్శుల చర్చలపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News