: షేర్ మార్కెట్ నుంచి మూడేళ్ల పాటు డీఎల్ఎఫ్ ఔట్!
ఐపీఓలో తప్పుడు సమాచారం ఇచ్చి పెట్టుబడిదారులను మోసగించేందుకు యత్నించిందనే కారణంతో... ప్రముఖ రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ ను షేర్ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సహా ఏ ఇతర షేర్ మార్కెట్లలోనూ మూడేళ్ల పాటు డీఎల్ఎఫ్ కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధానికి గురైనట్లైంది. సంస్థతో పాటు సంస్థ ప్రమోటర్, ఛైర్మన్ కేపీ సింగ్, ఆయన కుమారుడు రాజీవ్ సింగ్, కుమార్తె ప్రియా సింగ్, సంస్థ ఎండీ టీసీ గోయల్, మాజీ సీఎఫ్ఓ కామేశ్వర్, మాజీ ఈడీ (లీగల్) రమేశ్ సంకాలపైనా సెబీ మూడేళ్ల పాటు నిషేధం విధించింది. డీఎల్ఎఫ్ లో కేపీ సింగ్ కటుంబానికి 75 శాతం వాటా ఉంది. 2010లో డీఎల్ఎఫ్ వ్యవహరించిన తీరు కారణంగా పెట్టుబడిదారుల్లో సెబీ పట్ల నమ్మకం కోల్పోయే ప్రమాదం ఏర్పడిన కారణంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు సెబీ పర్మనెంట్ మెంబర్ రాజీవ్ అగర్వాల్ చెప్పారు.