: తుపాను విలయంపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన మోడీ
ఉత్తరాంధ్రను వణికించిన హుదూద్ తుపానుపై నిన్న సాయంత్రం ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తుపాను సహాయక చర్యల్లో ఏమాత్రం అలసత్వం ఉండకూడదని, ఎక్కడా రాజీ పడకూడదని ఈ సందర్భంగా అధికారులకు మోడీ సూచించారు. సహాయక కార్యక్రమాల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ రోజు మోడీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.