: మోడీ సాయం చేస్తారు... ధైర్యంగా ఉండండి: రోశయ్య
హుదూద్ తుపాను చేసిన విధ్వంసాన్ని తెలుసుకున్నానని తమిళనాడు గవర్నర్ రోశయ్య తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, హుదూద్ తాకిడికి ధ్వంసమైన ప్రాంతాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సహాయం చేస్తారని అన్నారు. తుపాన్ లో మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుపాన్ బాధితులకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు ధైర్యంగా ఉండాలని చెప్పారు.