: రికార్డు స్థాయి లాభాలార్జించిన రిలయన్స్ ఇండస్ట్రీస్
ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలార్జించిందని ఈ సంస్థ వెల్లడించింది. జూలై, సెప్టెంబర్ మధ్య కాలంలో నికర లాభం 1.7 శాతం పెరిగిందని సంస్థ తెలిపింది. దీంతో అంచనాలకు మించి 5, 972 కోట్ల రూపాయల లాభాలు నమోదు చేసిందని, అమ్మకాలు తగ్గినప్పటికీ, రిఫైనింగ్ మార్జిన్స్ పెంపు, ఇన్ పుట్ కాస్ట్స్ తగ్గింపు వల్ల లాభాలు పెరిగినట్టు నిపుణులు చెప్పారు.