: హడలెత్తిస్తున్న చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్లోగన్ కు కట్టుబడ్డారు. నేను పని చేస్తాను...మీరు పని చేయండి అంటూ అందర్నీ పరుగులు పెట్టిస్తున్నారు. హుదూద్ విలయతాండవం చేయడంతో విశాఖ అతలాకుతలమైంది. దీంతో అక్కడి వ్యాపారులు ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెవుల్లో పడింది. దీంతో ఆయన నేరుగా విషయం తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు. వరదబాధిత ప్రాంతాలను, ప్రజలను పరామర్శిస్తూ పనిలో పనిగా పెట్రోలు బంకులను తనిఖీ చేశారు. ఎవరైనా నోస్టాక్ బోర్డు పెట్టినా, ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిసినా, కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, చేతనైతే తక్కువ ధరకు విక్రయించి పెద్దమనసు చాటుకోవాలని ఆయన సూచించారు.