: 26 వేల పంచదార బస్తాలు నీటిపాలయ్యాయి
విశాఖపట్టణం జిల్లా ఏటికొప్పాక చక్కెర పరిశ్రమలో దారుణం సంభవించింది. హుదూద్ తుపానులో వీచిన దుమారం ధాటికి ఏటికొప్పాక చక్కెర పరిశ్రమ గోదాము పైకప్పు ఛిద్రమై ఎగిరిపోయింది. దీంతో గోదాములో నిల్వ చేసిన 26 వేల పంచదార బస్తాలు నీటిపాలయ్యాయి. దీంతో యాజమాన్యం తీవ్ర ఆందోళన చెందుతోంది.