: విజయనగరంలో హుదూద్ మిగిల్చిన నష్టం ఇదీ
హుదూద్ తుపాను కారణంగా విజయనగరం జిల్లాలో వాటిల్లిన నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇది పూర్తి నివేదిక కాదని, పూర్తి నివేదికను రూపొందించాల్సి ఉందని తెలిపిన అధికారులు... తమకు ఉన్న సమాచారం మేరకు ప్రాథమిక అంచనాను రూపొందించారు. విజయనగరం జిల్లాలో 650 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 46 రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. 760 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 10 విద్యుత్ ఉపకేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 19 చెరువులకు గండ్లు పడడంతో 426 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్లు కొట్టుకుపోగా, 140 కిలోమీటర్ల మేర పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయి. 11,323 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 73 తాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. 9,239 చెట్లు కూలిపోయాయి. ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడగా, 107 పశువులు, 527 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. దీంతో, సుమారు 125 కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు.