: హర్యానాలో పడిపోతున్న లింగ నిష్పత్తికి దేవుడే కారణమట!


కొన్నేళ్ళుగా ఉత్తరాది రాష్ట్రాల్లో స్త్రీ, పురుష లింగ నిష్పత్తి దారుణంగా పడిపోతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా ఈ అంశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే హర్యానా కొంచెం మెరుగైన స్థితిలోనే ఉన్నా, ఇంకా తిరోగమనంలోనే సాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాలోని జింద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి 1000 మంది పురుషులకు 871 మంది స్త్రీలే ఉన్నారట. ఈ ప్రాంతంలో స్త్రీ శిశువులను పురిట్లోనే చంపేయడం, గర్భంలో ఉన్నది అమ్మాయని తేలితే అబార్షన్లు చేయించడం పరిపాటి. దీనిపై జింద్ ఎమ్మెల్యే డాక్టర్ హరి చంద్ మిద్ధా (ఐఎన్ఎల్డీ పార్టీ) ఏమంటున్నారో వినండి. అదంతా భగవంతుడి లీల అంటున్నారు. "యే సబ్ భగవాన్ కీ మర్జీ హై. హమ్ కుచ్ నై కర్ సక్తే (అదంతా దేవుడి ఇష్టం. మనమేం చేయలేం)" అంటూ నెపం దేవుడిపైకి నెట్టారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జింద్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి 1000 మంది పురుషులకు 875 మంది స్త్రీలే ఉన్నారు. ఇదేమీ దేవుడిచ్చింది కాదని, స్త్రీ శిశువులను చంపేయడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అయిందని అన్నారు. అభివృద్ధే ఇలాంటి రుగ్మతలకు పరిష్కారమని మోడీ నొక్కి చెప్పారు.

  • Loading...

More Telugu News