: 'హ్యాపీ న్యూ ఇయర్' లో అబ్ రామ్


బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ చిన్న కొడుకు అబ్ రామ్ వెండితెరపై కనిపించబోతున్నాడు. తల్లి గౌరీ ఖాన్ తో కలసి 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో తళుక్కున మెరవనున్నాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ పత్రిక ఇంటర్వ్యూలో షారుక్ భార్య గౌరీ వెల్లడించింది. సినిమాలో అబ్ రాం కూడా భాగం కావాలన్నది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమని తెలిపింది. దర్శకురాలు ఫరాఖాన్, షారుక్ చెప్పడంతో అబ్ రాంతో కలసి సన్నివేశంలో తానూ పాల్గొన్నట్లు గౌరీ చెప్పింది. కొన్ని రోజుల కిందటే అబ్ రాం తొలి ఫోటోను మన బాలీవుడ్ బాద్షా ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News