: త్వరలో ఢిల్లీకి తెలంగాణ టీడీపీ నేతలు
తెలంగాణ టీడీపీ నేతలు ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్, రైతు సమస్యలపై పీఎంతో టీడీపీ నేతలు చర్చించనున్నారు. ఇంకా పలు అంశాలపైనా కేంద్రంతో మాట్లాడే అవకాశం ఉంది.